శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇలా.. కలలో కూడా ఊహించలేదు : విశాల్

23 గంటల క్రితం

I never even imagined this in my dreams: Vishal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 11:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు : '' లయోలా కాలేజీలో నా సీనియర్‌ (విజయ్‌).. నా బ్యాచ్‌మేట్‌ (ఉదయనిధి) ని ఇలా ఒక రోజు అరెస్ట్‌ చేస్తారని కలలో కూడా ఊహించలేదు. `` అని సినీనటుడు విశాల్ పేర్కొన్నారు. రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని విశాల్‌ సూచించారు. డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్‌ సినీనటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు, ఆయన అరెస్ట్‌ పై విశాల్‌ మాట్లాడారు. తన తాజా చిత్రం ‘మగుడం’ (తెలుగులో మకుటం) ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందిస్తూ .... ‘‘ నేను ఉదయనిధి ప్రసంగాన్ని చూశాను. వాక్‌ స్వాతంత్య్రం అందరికీ ఉంటుంది. కానీ, మనం కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ ప్రసంగాల్లో ముందుగా రాసుకున్నవి చెబితే ఇలాంటివి ఎదురుకావు. అప్పటికప్పుడు సహజంగా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. లయోలా కాలేజీలో నా సీనియర్‌ (విజయ్‌).. నా బ్యాచ్‌మేట్‌ (ఉదయనిధి) ని ఇలా ఒకరోజు అరెస్ట్‌ చేస్తారని కలలో కూడా ఊహించలేదు. విజయ్‌ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. ఇదంతా అందులో భాగమే. ఇదే అసలు రాజకీయం అంటే ’’ అని విశాల్ అన్నారు. మరోవైపు విశాల్‌ రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు తమిళనాట జోరుగా ప్రచారమవుతున్నాయి. ఇప్పటివరకూ తాను సొంతం చేసుకున్న మంచి పేరును ప్రజా సేవకు ఉపయోగించాలని అనుకుంటున్నట్లు ఇటీవల ఆయన ఓ వేదికపై చెప్పడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్