ముంబయి : తాను కూడా నీట్ పేపర్ లీక్ బాధితురాలినేనని బాలీవుడ్ సినీనటి మానుషి చిల్లర్ వెల్లడించారు. నీట్ ప్రశ్నా పత్రం లీక్ ఘటనపై ఆమె స్పందిస్తూ .... తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. 2015లో నీట్ పేపర్ లీక్ కావడంతో, తాను మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చిందన్నారు. తనకు కూచిపూడి, పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. వీటిని ఏడాది పాటు పక్కన పెట్టి ప్రవేశ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యానన్నారు. డాక్టర్ అవ్వాలని తాను ఎన్నో కలలు కన్నానని, కష్టపడి చదివి, పరీక్ష రాసినప్పటికీ పేపర్ లీక్ కావడంతో అప్పట్లో చాలా కఠినమైన దశను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఇప్పటికీ విద్యార్థులు అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం బాధాకరమని మానుషి అన్నారు. పరీక్ష కోసం మళ్లీ మళ్లీ చదవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు ఎదుర్కొంటారని తెలిపారు. హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ తల్లిదండ్రులు మిత్రా మసు, నిలీమా ఇద్దరూ డాక్టర్లే. దీంతో ఆమె కూడా చిన్ననాటి నుంచి వైద్య రంగంలోకి రావాలని కలలు కన్నారు. 2017లో ప్రపంచ సుందరిగా నిలిచారు. ఆపై బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘టెహ్రాన్’ తదితర చిత్రాల్లో నటించారు.
నేను కూడా నీట్ పేపర్ లీక్ బాధితురాలినే : మానుషి చిల్లర్
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 10:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)