నిత్యా మీనన్ బాలీవుడ్‌లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'మిస్టర్ అండ్ మిసెస్ గ్రే` చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను అలరించనున్నారు. వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను, రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. వేవ్‌బ్యాండ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మూడేళ్లుగా నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాదే విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇందులో నిత్యా మీనన్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, ఊహించని షేడ్స్‌తో ఉండబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ప్రాణంగా ప్రేమించే వ్యక్తి వల్లే ప్రాణభయం ఏర్పడితే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో అంకుర్ పజ్నీ, విశాల్ రంజన్ మిశ్రా సంయుక్తంగా తెరకెక్కించారు.
డిసెంబర్లో ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ విడుదల
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026, 07:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)