mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘Nagabandham’ – పాన్ ఇండియా రేంజ్ లో ‘నాగబంధం’..!

22 మే, 2026

'Nagabandham' on a pan-India scale..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 01:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వినోదం : నాగబంధం సినిమాతో యువ హీరో విరాట్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం జూలై 3 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, రెండు పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని NIK Studios భారీ స్థాయిలో నిర్మిస్తోంది. పురాణ కథలు, చారిత్రక అంశాలను కలిపి కొత్త తరహా కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ ప్రేక్షకుల కోసం Zee Studios ఈ సినిమాను సమర్పిస్తోంది. నార్త్ లో కూడా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ‘నాగబంధం’ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతోంది.




పవర్ ఫుల్ ఫీల్ పోస్టర్ ..!
తాజాగా చిత్ర బృందం మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో విరాట్ కర్ణ ఓ భారీ నాగుతో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. వర్షంలో నిలబడి, చేతికి పెద్ద కోబ్రా ను చుట్టుకొని, చేతిలో భారీ కత్తితో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన లుక్ కనిపిస్తోంది. ఒకవైపు మంటలు ఎగిసిపడుతున్న యుద్ధ వాతావరణం, మరోవైపు సముద్ర అలలు పోస్టర్‌కు మరింత పవర్‌ఫుల్ ఫీల్ తీసుకొచ్చాయి.

వేగంగా పనులు ….
సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోల్లో కనిపించిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా CG, VFX పనులను దేశంలోని ప్రముఖ స్టూడియోలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. థియేటర్లలో అద్భుతమైన విజువల్ అనుభూతి ఇవ్వాలని మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్