శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యూట్యూబర్‌ రమా నందనకు మళ్లీ నోటీసులు

4 గంటల క్రితం

Notices issued again to YouTuber Rama Nandana.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితురాలైన యూట్యూబర్‌ రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం మళ్లీ నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్‌ షో ఎంపికల కోసం హైదరాబాద్‌ వచ్చిన రమానందన.. నిన్న న్యాయవాదితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నోటీసులు తీసుకున్నారు. యుకె లో ఉద్యోగం కోసం ఓ కుటుంబం 2023 లో కన్సల్టెన్సీ నిర్వాహకులకు ముందుగా రూ.లక్ష, అనంతరం రూ.9.60 లక్షలు చెల్లించింది. ఉద్యోగం రాకపోవడంతోపాటు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఈ ఏడాది జూన్‌లో ఆ కుటుంబంవారు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రమానందనతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదయ్యింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్