ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిజంగా డ్యాన్స్‌ చేసినా ఎఐ అనుకుంటారేమో : మమ్ముట్టి

21 గంటల క్రితం

People might think its AI even if I actually dance Mammootty
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 01:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎఐ వీడియోలతో తన డ్యాన్స్‌ కోరికకు బ్రేక్‌.. సినీ పరిశ్రమపై కృత్రిమ మేధ ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు


వినోదం : సినిమాల్లో ఒక్కసారైనా డ్యాన్స్‌ చేయాలన్న కోరిక తనకు ఉందని, అయితే ఇప్పుడు ఆ కోరికను వదులుకున్నానని మలయాళ స్టార్‌ మమ్ముట్టి సరదాగా వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియాలో తన డ్యాన్స్‌ ఎఐ వీడియోలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ... తాను నిజంగా తెరపై డ్యాన్స్‌ చేసినా ప్రేక్షకులు అది కృత్రిమ మేధ సృష్టించిన వీడియోనే అనుకుంటారేమోనని మమ్ముట్టి చమత్కరించారు. సోషల్‌ మీడియాలో తనకు సంబంధించిన డ్యాన్స్‌ రీల్స్‌ చూసి ఆశ్చర్యపోతున్నానని తెలిపారు. ఎఐ టూల్స్‌ తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి రావడంతో యువత విభిన్నమైన వీడియోలు రూపొందిస్తున్నారని చెప్పారు. జీవితంలో ఎప్పుడూ ఊహించని రీతిలో తనతో డ్యాన్స్‌ చేయిస్తున్నారని, అందుకే ఇక సినిమాల్లో డ్యాన్స్‌ చేయాలనుకోవడం లేదని అన్నారు. అయితే, ఎఐ ప్రభావాన్ని కేవలం వినోదంగా మాత్రమే చూడలేమని మమ్ముట్టి హెచ్చరించారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకోవచ్చని, మనుషుల కదలికలను సైతం నియంత్రించే పరిస్థితులు రావచ్చని అభిప్రాయపడ్డారు. అమెరికా, చైనా వంటి దేశాలు ఎఐ అభివృద్ధిలో ముందున్నాయని, ఈ సాంకేతికత తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘ఓం’ (OM) నవంబరు 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ధనుష్‌, సాయిపల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్