mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘రణబాలి’ మేకింగ్‌ వీడియో విడుదల

11 మే, 2026

telugu cinema

రష్మిక మందన్న – విజయ్‌

వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ చిత్రం నుండి తాజాగా మేకింగ్‌‌ వీడియో ఒకటి విడుదలైంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న – విజయ్‌కు జోడిగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ వీడియోను విడుదల చేసింది. అందులో విజయ్ గుర్రంపై స్వారీ చేస్తున్న సన్నివేశాలు కనిపిస్తాయి. గుర్రంపై స్వారీ చేయడానికి విజయ్‌ ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడో ఈ వీడియోలో చూపించారు. ఈ మేకింగ్ వీడియో ప్రకారం దాదాపు రెండు సార్లు గుర్రం ఎక్కిన సమయంలో అది విజయ్‌ను కింద పడేసింది. దాంతో ఆయన గాయాల పాలయ్యాడు. అయినప్పటికీ అదే గుర్రంపై స్వారీ చేయాలని తీవ్రంగా శ్రమించి చివరకు విజయవంతంగా దానిపై స్వారీ చేశాడు. ఈ మొత్తం ప్రాసెస్‌ను ఈ వీడియోలో చూపించారు. విజయ్ నటిస్తున్న రౌడీ జనార్థన్ నుండి కూడా శనివారం ఫస్ట్ లుక్ విడులైంది.telugu cinema

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్