ముంబయి : బాలీవుడ్ సినీనటి కత్రినా కైఫ్ ప్రసవానంతరం బరువు పెరగడం పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై సినీనటుడు సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ‘బిగ్ బాస్-20’ కార్యక్రమంలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. మహిళల బరువు, వయసు, అందంపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.
గర్భధారణ అనంతరం బరువు పెరగడం సహజమైన విషయమని సల్మాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం కత్రినా తన కుటుంబంతో సమయం గడుపుతున్నారని, తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనే సమయానికి ఆమె మునుపటి ఆకృతికి చేరుకుంటారని అన్నారు. సోషల్ మీడియా ట్రోల్స్‌ను ఆమె పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
సోషల్ మీడియా ద్వారా కొందరు ఉపాధి పొందుతుండగా.. మరికొందరు ఇతరులను కించపరుస్తూ డబ్బు సంపాదిస్తున్నారని సల్మాన్ విమర్శించారు. ఇతరుల వయసు, బరువు, అందంపై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తనను కూడా వయసు పెరిగిందంటూ ట్రోల్ చేస్తున్నారని, తనకు 60 ఏళ్లు వచ్చాయని చెప్పారు. వయసు పెరగడం సహజమని, దానిని తప్పుగా చూడకూడదన్నారు.
కుప్పకూలినట్లు ప్రోమో.. ప్రాంక్ అని వెల్లడి ....
ఇదిలా ఉండగా, ‘బిగ్ బాస్-20’కు సంబంధించిన మరో ప్రోమోలో సల్మాన్ అకస్మాత్తుగా ఛాతీ పట్టుకుని కుప్పకూలినట్లు కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే అది కేవలం ప్రాంక్ మాత్రమేనని సల్మాన్ స్పష్టం చేశారు. హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ తనకు ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ ఉందని ఇతరులకు అబద్ధం చెప్పినట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలతో సరదాగా వ్యవహరిస్తే ఇతరులు ఎంతగా ఆందోళన చెందుతారో అతడికి అర్థమయ్యేలా చేయడానికే తాను అలా చేసినట్లు వివరించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)