బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కుమార్తె అంజిలీరెడ్డి-రఘురామిరెడ్డిల వివాహాన్ని బంధుమిత్రుల సమక్షంలో బెంగళూరు సమీప నందిహిల్స్‌లోని ‘మనధీర’ రిసార్టులో బుధవారం సాయంత్రం క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఇరువైపుల నుంచి వంద మంది చొప్పున మాత్రమే అతిథులు విచ్చేశారు. షర్మిల సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఈ పెళ్లి ఆహ్వానం లేదు. జగన్‌తో సన్నిహితంగా ఉండే బంధువులెవరూ కార్యక్రమానికి హాజరు కాలేదు. గురువారం నందిహిల్స్ పరిసరాల్లోని ఓ రిసార్టులో ఈ వివాహాన్ని హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు రాష్ట్ర రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ వేడుకకు హాజరు కాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.
నందిహిల్స్ రిసార్టులో షర్మిల కుమార్తె వివాహం
2 రోజుల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 12:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)