తమిళ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం 'డేర్ డెవిల్'. ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటించనున్నారు. ఈ విషయాన్ని అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర నవంబర్ 16న ధ్రువీకరించారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మూడు, నాలుగు నెలల క్రితమే శివరాజ్‌కుమార్‌కు కథ వినిపించగా ఆయన వెంటనే అంగీకరించినట్లు తెలిపారు. అజిత్‌కు కూడా శివరాజ్‌కుమార్‌పై ఎంతో గౌరవం ఉందని, ఆయనే స్వయంగా మాట్లాడి ఈ పాత్రకు ఒప్పించారని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇందులో శ్రీలీల, ఉన్ని ముకుందన్, ప్రభు, పార్తీబన్, సునీల్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 17 లేదా 18 నుంచి శివరాజ్‌కుమార్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. డిసెంబర్ వరకు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ కొనసాగనుంది.








కామెంట్‌లు (0)