శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం

1 గంట క్రితం

Major accident averted at Srinagar Airport
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్ : శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులోని స్తంభాన్ని ఇండిగో విమానం ఢీకొట్టింది. పార్కింగ్‌చేస్తుండగా ఘటన జరిగింది. విమానం ముందు భాగం దెబ్బతింది. సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నవి ముంబయి నుంచి శ్రీనగర్‌కు వెళుతున్న ఇండిగో విమానం శుక్రవారం ఉదయం 9 గంటల 2 నిముషాలకు శ్రీనగర్ విమానాశ్రయంలో పార్కింగ్ చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను మాన్యువల్ మెట్లను ఉపయోగించి సురక్షితంగా విమానం నుంచి దించినట్లు ఇండిగో తెలిపింది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ప్రమాదానికి అసలు కారణాలను నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం కూడా శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. విమానాల రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని ఇండిగో తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్