యువ నటుడు తేజ సజ్జా త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌తో పాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రవితేజ, రానా దగ్గుబాటి, శివాజీ, కె. రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్ దంపతులు, నిర్మాతలు విశ్వప్రసాద్, సాహు గారపాటి తదితరులు హాజరయ్యారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
తేజ సజ్జా నిశ్చితార్థం
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026, 06:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)