సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హెచ్‌సిఎల్‌ టెక్‌ లాభం రూ.5,132 కోట్లు

1 గంట క్రితం

hcl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 09:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌

​న్యూఢిల్లీ: ఐటి సేవల సంస్థ హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ ఆర్థిక సంవత్సరం 2026-27 సెప్టెంబర్‌‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో రూ.5,132 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,235 కోట్లతో పోలిస్తే లాభం 21 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.35,620 కోట్లకు చేరింది. సేవల విభాగంలో వృద్ధి, కొత్త ఒప్పందాలు, కృత్రిమ మేధ (ఎఐ) ఆధారిత ప్రాజెక్టులకు పెరుగుతున్న డిమాండ్‌ త్రైమాసిక ఫలితాలకు దోహదపడ్డాయని ఆ కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో 3.26 బిలియన్‌ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను దక్కించుకున్నట్లు తెలిపింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రెండో మధ్యంతర డివిడెండ్‌గా ఒక్కో షేరుకు రూ.12 చెల్లించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఈ డివిడెండ్‌ పొందేందుకు అర్హులైన వాటాదారులను గుర్తించే రికార్డు తేదీ అక్టోబర్‌ 16గా, చెల్లింపు తేదీ అక్టోబర్‌ 26గా ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్