ఆది సాయికుమార్ హీరోగా రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘అరుంధతి నక్షత్రం’. తాజాగా ఈ సినిమా ప్రారంభమైంది.‘ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ ఈ సినిమాను గ్రామీణ కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మేఘా శెట్టి, మధు దామరాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 7పీఎం ప్రొడక్షన్స్, శ్రీచక్ర మూవీస్ ఎల్ఎల్సీ బ్యానర్లపై సందీప్ ఆగరం, అష్మిత రెడ్డి బాసాని, డా. సూర్యకాంతి కూచిభొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్ కొట్టారు. నిర్మాతలు రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు.








కామెంట్‌లు (0)