గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమితాబచ్చన్ కు గాయం

2 గంటల క్రితం

అమితాబచ్చన్ కు గాయం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 07:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. ఎన్నో ఏళ్లుగా తాను హోస్ట్ గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షో షూటింగ్‌లో ఆయన జారి కిందపడ్డారు. దీంతో ఆయన మోకాలికి గాయమైంది. వెంటనే సెట్ లోని సభ్యులు ఆసుప్రతికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ విషయాన్ని ఆయనే తాజాగా వెల్లడించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్ చెప్పారు. అయితే ఈ గాయం వల్ల ఈ షో లో పాల్గొనే పోటీదారులను ఆహ్వానించడానికి వాళ్ల వద్దకు వెళ్లి నిలబడడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని.. తన సీటు వద్దే నిలబడి ఆహ్వానిస్తున్నానని ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్