గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలి

1 గంట క్రితం

chnr.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 08:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 'చలో ఢిల్లీ` జయప్రదం చేయాలి : నర్సింగరావు

ప్రజాశక్తి - తిరుపతి టౌన్ :కనీస వేతనం రూ.42వేలు ఇవ్వాలని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1-3 తేదీల్లో చేపట్టే 'చలో ఢిల్లీ` కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు కోరారు. గురువారం వేమన విజ్ఞాన కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు ఇటీవల కాలంలో 18 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని, ఇందులో జి గ్రూప్ సంస్థకు రూ. 22,600 కోట్లు మాఫీ చేయడానికి పూనుకుందని, అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కొంత వెనక్కు తగ్గిందన్నారు. దేశంలోని సహజ సంపదనను కార్పొరేట్‌ ‌కంపెనీలకు కట్టబెడుతోన్న కేంద్ర ప్రభుత్వం కార్మికులకు మాత్రం న్యాయం చేయడం లేదన్నారు. స్కీం వర్కర్లు, అంగన్‌‌వాడీ కార్మికులకు పని భారం పెంచడం తగదన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, 42 మంది పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, సిఐటియు జిల్లా నాయకులు జి బిఎస్ మన్యం, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.జయచంద్ర, టి.సుబ్రమణ్యం పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్