2025 సంవత్సరానికి సంబంధించిన నంది చలనచిత్ర అవార్డులతో పాటు జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నటుడు నందమూరి బాలకృష్ణను నియమించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి, నటి ప్రభ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 2213 జారీ చేసింది. ఇదే జీవో ద్వారా 2025 సంవత్సరానికి సంబంధించిన ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యత, బాలల చిత్రాల అవార్డుల ఎంపిక కోసం దర్శకుడు బి. గోపాల్ అధ్యక్షతన మరో కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, 2017 నుంచి 2025 వరకు వివిధ సంవత్సరాలకు సంబంధించిన నంది చలనచిత్ర, టీవీ, నాటక అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. వీటి ఎంపిక కోసం కూడా ప్రత్యేక జ్యూరీలను నియమించింది.
నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 06:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)