సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసుభాష్ చంద్రపై ఇడి మనీ లాండరింగ్ కేసు

1 గంట క్రితం

సుభాష్ చంద్రపై ఇడి మనీ లాండరింగ్ కేసు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 09:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ.1,322 కోట్ల నష్టం కలిగించినట్లు ఆరోపణలు రావడంతో మీడియా దిగ్గజం సుభాష్ చంద్రపై ఇడి మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. రుణాల కోసం తన ఆస్తుల విలువను పెంచి చూపి, తప్పుడు పత్రాలు సమర్పించారని సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఇడి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎగవేత వల్ల సంస్థకు రూ.1,322 కోట్ల నష్టం వాటిల్లిందని ఎల్ఐసి పేర్కొంది. చంద్ర వ్యక్తిగత ఆస్తుల నుంచి రుణదాతలు సుమారు రూ.6.5 కోట్లు మాత్రమే రాబట్టుకునేందుకు వీలు కల్పిస్తూ ఇటీవల ఎన్‌సిఎల్‌టి ఆమోదించిన చెల్లింపు ప్రణాళికను సవాలు చేస్తూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి)ను ఆశ్రయించిన రుణదాతల్లో ఎల్‌ఐసిహెచ్‌ఎఫ్‌ఎల్ కూడా ఉంది. ‘‘సుభాష్ చంద్ర, రుణగ్రహీతలైన వసంత్ సాగర్ ప్రాపర్టీస్, పాన్ ఇండియా ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, స్పిరిట్ ఇన్‌ఫ్రాపవర్ అండ్ మల్టీవెంచర్స్ సంస్థలు, వాటి అధికారులు, డైరెక్టర్లతో కుమ్మక్కై, ఎల్‌ఐసిహెచ్‌ఎఫ్‌ఎల్‌ను మోసగించి రుణగ్రహీత సంస్థలకు రుణాలు ఇప్పించారు. ఆ సంస్థలు ఆ నిధులను దుర్వినియోగం చేశాయి’’ అని ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్