సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఫహాద్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమా టీజర్ విడుదల

1 గంట క్రితం

dont trouble the trouble
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

'పుష్ప` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’. ఈ చిత్రాన్ని ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శశాంక్ యేలేటి తెరకెక్కించారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీన తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఫహాద్ మార్క్ నటన, కామెడీ టైమింగ్ ఈ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్