సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆకివీడు రామాలయ నిర్మాణం కేసు విచారణ 27కు వాయిదా

4 గంటల క్రితం

supreem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 09:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణంపై దాఖలైన పిటిషన్ విచారణ వారం రోజులు వాయిదా పడింది. ఆకివీడులో రామాలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖ‌లైన‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ విక్ర‌మ్‌నాథ్‌, జ‌స్టిస్ సందీప్ మెహ‌తాతో కూడిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం సోమ‌వారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేసేందుకు, తరువాత రిజాయిండర్‌ వేసేందుకు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం సమయం ఇచ్చింది. వారం రోజుల తర్వాత విచారణ చేపడుతామన్న ధర్మాసనం, ఈ నెల 27కు వాయిదా వేసింది. పిటిషనర్ తరపున న్యాయవాదులు జడ శ్రవణ్ కుమార్, గౌరవ్ గోయల్ వాదనలు వినిపించారు. ఆలయ కమిటీ తరపున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్