సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

4 గంటల క్రితం

suside
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 09:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుత్తి : అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన రైతు చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటు చేసుకున్నా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... అబ్బేదొడ్డి గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు(43) కంది పంట సాగు కోసం రూ.4 లక్షలు అప్పులు చేశారు. వర్షాభావంతో పంట చేతికందలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మానసిక వేదనకు గురై ఈ నెల 11న ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించి గుత్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. మృతునికి భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్