సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగొర్రెల కాపరి మృతి కేసు.. లొంగిపోయిన మాజీ మంత్రి సీదిరి తనయుడు

4 గంటల క్రితం

sidiri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పలాస (శ్రీకాకుళం జిల్లా): ఈ నెల పదో తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దుబ్బ దానయ్య మృతికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మ కారణమని పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని కాశీబుగ్గ ఇండస్ర్టియల్ పార్కు సమీపంలో అతి వేగంతో బైక్ నడిపి ఢీకొట్టడంతో దానయ్య మృతి చెందారని నిర్ధారించారు. ఈ కేసులో ఆరవ్ వర్మ న్యాయవాదులతో కలిసి వచ్చి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో సోమవారం లొంగిపోయారు. కాశీబుగ్గ సూదికొండలో నివాసం ఉంటున్న గొర్రెల కాపరి దుబ్బ దానయ్య ఈ నెల పదో తేదీన రాత్రి 9.30 గంటల సమయంలో నడిచి వెళ్తుండగా, ఆరవ్ వర్మ బైక్‌తో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తానే ఈ ప్రమాదానికి కారణమని ఆరవ్ బదులుగా అతని స్నేహితుడు, అప్పలరాజు ప్రధాన అనుచరుడి కుమారుడైన సిద్ధార్థ త్యాడి పోలీసులకు లొంగిపోవడంతో, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఇంత ప్రమాదం సంభవించినా సిద్దార్థ త్యాడికి ఎటువంటి గాయాలూ లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకముందే గాయపడిన ఆరవ్ వర్మను అక్కడ్నుంచి కారులో విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించేసినట్లు గుర్తించారు. ఆయా దృశ్యాల సిసిటివి ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. దానయ్య మృతికి అప్పలరాజు కుమారుడే కారణమని తేలడంతో నిందితుడు పోలీసుల ఎందుట లొంగిపోయారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్