వైభవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర పుత్ర’. మలయాళంలో విజయవంతమైన ‘మాళిగాపురం’ చిత్రానికి దర్శకత్వం వహించిన విష్ణు శశిశంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా చిత్రబృందం తెలుగు వెర్షన్ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో మీనాక్షి గోవిందరాజన్ కథానాయికగా నటిస్తున్నారు. రవి మోహన్, మిర్చి శివ, వెంకట్ ప్రభు, కృష్ణ, మహత్, ప్రేమ్‌జీ అమరన్ తదితరులు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. తంత్రా ఫిలింస్ పతాకంపై జె.కె. శరవణ, ఎం. రాజారామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్‌జీ అమరన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
'హరిహర పుత్ర' టీజర్ విడుదల
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 06:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)