బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దర్శకుడి తీరుతో తీవ్రంగా అవమానపడ్డా: సూరి

1 రోజు క్రితం

DSC0988-1788268056333-3577.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోలీవుడ్‌ హాస్య నటుడు, హీరో సూరి తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానున్న ‘మండాడి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఒక పెద్ద హీరో సినిమాలో నటించేందుకు నన్ను పిలిచారు. అందులో ఓ టాప్‌ కమెడియన్‌తో కలిసి నటించే సన్నివేశం ఉంది. షూటింగ్‌ పూర్తయ్యాక పెద్ద హీరో, దర్శకుడు కలిసి మానిటర్‌లో సీన్‌ చూశారు. ఆ తర్వాత నా చొక్కా విప్పేసి, రికమండేషన్‌తో వచ్చిన మరో వ్యక్తికి ఇవ్వాలని చెప్పారు. అది నా సొంత చొక్కా అని చెప్పినా వినకుండా లాక్కొని కాస్ట్యూమ్‌ వెహికల్‌పైకి విసిరేశారు. దీంతో ఒంటికి టవల్‌ చుట్టుకుని తీవ్ర అవమాన భారంతో నా చొక్కా కోసం అక్కడ వెతుక్కున్నా. నా సినీ ప్రయాణంలో నన్ను అత్యంత మానసిక వేదనకు గురిచేసిన సంఘటన ఇదే. దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అని సూరి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్