రజినీకాంత్ ‘జైలర్’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘జైలర్ 2’ చిత్రంతో త్వరలో సందడి చేయనున్నారు. ఈ చిత్రం ప్రకటించిన సమయానికి విడుదల కాదనే వార్తలపై మేకర్స్ స్పందించారు. తాజాగా ముందుగా వెల్లడించిన తేదీ అక్టోబర్ 15న ఈ సినిమా విడుదలవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుందని వెల్లడిస్తూ తాజాగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్.జే. సూర్య, హృతిక్ రోషన్, సీనియర్ నటి రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
అక్టోబర్ 15న జైలర్ 2 విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 09:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)