ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నటించిన చిత్రం 'జన నాయగన్'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ చిత్రం జూలై 23న థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. అదే రోజు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పోలీస్ డ్రెస్సులో ఉన్న విజయ్ ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు కథానాయికలుగా నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Print Edition23న ‘జన నాయగన్’ విడుదల
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 15, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)