గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదేశంలో తొలి హైడ్రోజన్‌ రైలు

1 గంట క్రితం

hydrogen-train
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 12:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్‌లో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రూ. 25 వేల కోట్లకు పైగా విలువైన కార్యక్రమాలు, పథకాలను ప్రారంభించనున్నారు. ఇందులో హైడ్రోజన్‌ ‌రైలు ప్రారంభం ఒకటి. ఈ రైలును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. పది కోచ్‌ల ఈ రైలు 3,200 హార్స్‌పవర్ (హెచ్‌‌పి) ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడవడంతోపాటు ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ప్యాసింజర్ రైలు సెట్‌లలో ఒకటి. ఈ రైలు హైడ్రోజన్, వాతావరణంలోని ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా నీటి ఆవిరిని తయారు చేసుకుని, తనంతట తాను విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. అనంతరం జలంధర్‌‌లో పర్యటించనున్న ప్రధాని వివిధ రాష్ర్టాల్లో అధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్