సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘జురాసిక్‌ పార్క్‌’ సామ్‌ నీల్‌ కన్నుమూత

1 గంట క్రితం

Sam-Neill
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన అద్భుత నటనతో దశాబ్దాల పాటు కోట్ల మంది ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటుడు సామ్ నీల్ (78) కన్నుమూశారు. 2026, జూలై 13 సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆయన చివరి శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుమూశారని సమాచారం. గతంలో సామ్‌ క్యాన్సర్ బారిన పడినప్పటికీ, మరణించే సమయానికి క్యాన్సర్ నుంచి పూర్తిగా విముక్తి ‌పొందారని కుటుంబం స్పష్టం చేసింది. సిడ్నీలోని సెయింట్ విన్సెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది ఆయనకు అందించిన అద్భుతమైన వైద్య సేవలకు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కష్టసమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని, అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు. సామ్ నీల్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు మొట్టమొదట గుర్తొచ్చే పాత్ర ‘జురాసిక్ పార్క్’ చిత్రంలోని డాక్టర్ అలన్ గ్రాంట్. స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్‌లో డైనోసార్ల నిపుణుడిగా ఆయన పోషించిన పాత్ర సినిమా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. సామ్ నీల్ హఠాన్మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్