భారత ప్రముఖ ఆవిష్కర్త, కోయంబత్తూరుకు చెందిన జీడీ నాయుడు జీవితకథ ఆధారంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'జీడీఎన్'లో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ, "జీడీ నాయుడు కేవలం ఆవిష్కర్త మాత్రమే కాదు.. గొప్ప దూరదృష్టి కలిగిన వ్యక్తి. అసాధారణ విజయాలు సాధించిన మహానుభావుడు. ఆయన సేవలు అనేక రంగాలకు విస్తరించాయి. అలాంటి వ్యక్తి జీవితాన్ని తమిళనాడుకే కాకుండా దేశవ్యాప్తంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం" అని అన్నారు. జీడీ నాయుడు భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ మోటార్, ఓటు నమోదు యంత్రం, 1952లో రూపొందించిన రెండు సీట్ల పెట్రోల్ కారు వంటి పలు ఆవిష్కరణలకు రూపకర్తగా గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రియమణి, వినయ్‌రాయ్, తంబి రామయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. కృష్ణకుమార్ రామ్‌కుమార్ కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, మాధవన్ సంయుక్తంగా నిర్మించారు.
Print Editionజీడీఎన్ బయోపిక్‌లో మాధవన్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 09:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)