బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవృత్తిదారులకు ఆధునిక పరికరాలు

2 గంటల క్రితం

Modern equipment for professionals
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 11:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రులు డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి,ఎస్ సవిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వృత్తిదారులకు ఆర్థిక భరోసా కల్పించేలా ఆధునిక పరికరాలను కూటమి ప్రభుత్వం అందజేస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, బిసి సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో లిడ్ క్యాప్ లెదర్ షోరూమ్‌ను మంత్రులు ఇరువురు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. చర్మకారుల ఉపాధి కల్పనకు మార్కాపురం జిల్లా యడవల్లి, కృష్ణా జిల్లా జి.కొండూరులో లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం లిడ్ క్యాప్‌కు పూర్వ వైభవం తీసుకొస్తుందని వెల్లడించారు. బిసి సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ.. సచివాలయంలో లిడ్ క్యాప్ అవుట్ లెట్ ఏర్పాటుతో నాణ్యమైన వివిధ రకాల లెదర్ ఉత్పత్తులు సచివాలయ ఉద్యోగులకు, సందర్శకులకు లభించే అవకాశం కలిగిందన్నారు. లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ.. చర్మకారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. లిడ్ క్యాప్ ద్వారా మంచి నాణ్యత కలిగిన వివిధ రకాల తోలు ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. సచివాలయంలో లిడ్ క్యాప్ అవుట్ లెట్ ప్రారంభం సందర్భంగా మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, సవిత లెదర్ ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, లిడ్ క్యాప్ ఎమ్‌డి ప్రసన్న వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్