బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWimbledon : సెమీస్‌‌కు కోస్ట్యూక్‌, నోస్కోవా

2 గంటల క్రితం

NOSKOVA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 11:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జ్వెరేవ్‌, ఆర్ధర్‌ ‌ఫెర్రీ కూడా..

  • వింబుల్డన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ

లండన్‌: వింబుల్డన్‌ ‌గ్రాండ్‌ ‌స్లామ్‌ ‌టోర్నీ మహిళల సింగిల్స్‌‌లో సెమీఫైనల్లోకి కోస్ట్యూక్‌, నోస్కోవా ప్రవేశించారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ ‌ఫైనల్లో 12వ సీడ్‌, ఉక్రెయిన్‌‌కు చెందిన కోస్ట్యూక్‌ , 9వ సీడ్‌, చెచియాకు చెందిన నొస్కోవా వరుససెట్లలో ప్రత్యర్ధులను చిత్తుచేశారు. కోస్ట్యూక్‌ 6-3, 6-2తో 13వ సీడ్‌, పోలిని(ఇటలీ)ని, నోస్కోవా 6-3, 7-5తో 25వ సీడ్‌, మెర్టెన్స్‌(‌బెల్జియం)ను ఓడించారు. ఇక పురుషుల సింగిల్స్‌ ‌సెమీఫైనల్లోకి 2వ సీడ్‌, జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ ‌జ్వెరేవ్‌, 9వ సీడ్‌, బ్రిటన్‌ ‌సంచలనం ఆర్దర్‌ ‌ఫెర్రీ ప్రవేశించారు. జ్వెరేవ్‌ 6-4, 6-4, 6-2తో 6వ సీడ్‌, ఫ్రిట్ట్‌(అమెరికా)ను, బ్రిటన్‌ ‌సంచలనం ఆర్గర్‌ ఫెర్రీ 6-4, 7-6(7-4),6-0తో 9వ సీడ్‌, కోబొలిని ఓడించారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ఆర్దర్‌ ‌ఫెర్రీతో జ్వెరేవ్‌, టాఫ్‌ ‌సీడ్‌ ‌సిన్నర్‌‌తో జకోవిచ్‌ ‌తలపడనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్