రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'వారణాసి'. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి 'దించుదించు' అనే తొలి పాటను డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మహేశ్ బాబు రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రుద్ర పాత్రతో కథ ప్రారంభమై, మరో పాత్రతో ముగుస్తుందని సమాచారం. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మహేశ్ ద్విపాత్రాభినయం?
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 06:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)