బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నయనతార 'ధర్మన్` ఫస్ట్‌ లుక్

5 గంటల క్రితం

నయనతార 'ధర్మన్` ఫస్ట్‌ లుక్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 07:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రజనీ సరసన నయనతార!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ధర్మన్‌'. కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి నయనతార కీలక పాత్ర పోషిస్తున్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. రామ్‌ పోతినేని, సిమ్రాన్‌, రాశిఖన్నా, శ్రీలీల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌ గతంలో ఎన్నడూ పోషించని వైద్యుడి పాత్రలో కనిపించనుండటం విశేషం. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్