సూర్య, టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్ లో ‘సూర్య48’ వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. నిజజీవిత వైద్యుడి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ప్రస్తుతం విదేశీ లొకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌లో సూర్యకు సంబంధించిన కొన్ని కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, యోగిబాబు, ఎలంగో కుమరవేల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
‘సూర్య 48’ కొత్త అప్డేట్
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026, 07:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)