క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పద మూడు వందల రకాల ఔషధాలు ధరలు తగ్గిస్తున్నట్టు...తద్వారా 3500 కోట్ల రూపాయలు దేశ ప్రజలకు ఆదా అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది సర్వత్రా హర్షించదగ్గ విషయమే. అయితే చిన్నచిన్న వ్యాధులకు సమీప వైద్యుల చెంతకు వెళితే ప్రవేశ రుసుం ఐదు వందల నుండి రెండు వేల రూపాయల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీనిపై అల్పాదాయ బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో దేశంలో లక్షలాది మంది ఒంటిపై నగలు, ఇల్లు, పొలాలు అమ్ముకుని వైద్యం చేయించుకోవలసిన దుస్థితి ఏర్పడుతున్నది. సామాన్యుల స్థితిగతులను పరిగణలోకి తీసుకొని క్యాన్సర్ కారక మందులకు ఇతోధికంగా ధరలపై నియంత్రణ తీసుకున్నట్లే...ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యుల ప్రవేశ రుసుము కనీసం వంద రూపాయలు లోపు ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అది సామాన్యులకు ఉపయోగంగా వుంటుంది.
- యర్రమోతు ధర్మరాజు,
సెల్: 9440263849






కామెంట్‌లు (0)