శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనాగలి నుంచి నినాదం వరకు ‘రైతాంగ పోరాటం’

1 గంట క్రితం

aiks conf logo.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 04:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నాగలి పట్టిన చేతులే నవ సమాజ నిర్మాతలు!

చెమట చుక్కలతో చరిత్ర రాసిన రైతన్నలు!!

భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం!

అన్యాయపు సంకెళ్లపై సమరశంఖం పూరించారు

1936లో పురుడు పోసుకున్న కిసాన్ సభ

కర్షకుల గుండెల్లో ఆశల జ్యోతిని వెలిగించింది

దోపిడీ దొరల పెత్తనాన్ని ఎదిరిస్తూ

రైతు హక్కుల సాధనకు ఉద్యమ బాట పట్టింది

వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా గళమెత్తి

భూస్వామ్య పెత్తనంపై పిడికిలి బిగించి

తెలంగాణ గడ్డపై వీర పోరాటం సాగించి

త్యాగాల చరిత్రలో సువర్ణాక్షరాలై నిలిచింది

ఎర్రజెండా నీడలో రైతన్నల ఐక్యత

అన్యాయంపై అలుపెరుగని పోరాట శక్తి

చలిని లెక్కచేయక.. కష్టాలను సహించక

2020–21లోనూ రైతాంగం గర్జించింది

పండించే వాడికి పంటపై హక్కు కావాలి

రైతు శ్రమకు తగిన గిట్టుబాటు ధర రావాలి

అప్పుల బాధలు తొలగి అన్నదాతలు

ప్రాణంతో ఉండాలి

రైతు కన్నీటి చుక్కలు ఆనంద బిందువులవ్వాలి

కిసాన్ సభా! నీ పోరాట స్ఫూర్తి అజరామరం...

రైతు ఐక్యతే సమసమాజ నిర్మాణానికి ఆధారం

రైతు బతికితేనే దేశం బతుకుతుంది

అన్నదాత గెలిస్తేనే భారతం వెలుగుతుంది!

​- డా. పూసపాటి వేదాద్రి,

సెల్‌: 9912197694

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్