మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒటిటిలోకి ‘ప్రేమనే ఊరిలో’

4 గంటల క్రితం

ఓటీటీలోకి ‘ప్రేమనే ఊరిలో’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కన్నడలో విజయం సాధించిన ‘ప్రేమద ఊరలి’ చిత్రం తెలుగులో ‘ప్రేమనే ఊరిలో’ పేరుతో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ఈ సినిమా నవంబర్‌ 17 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. మనోజ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయణ రఘు, శ్రీరామ్‌, రామిక శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.150 కోట్ల మేర వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం పేర్కొంది. వానిల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జనకమ్మ ప్రొడక్షన్స్‌ పతాకాలపై మమత దేవేంద్ర, ప్రశాంత్‌ డి.ఎస్‌, రమేశ్‌ ఎన్‌ నిర్మించారు. తెలుగు వెర్షన్‌ను చందు శ్రీనివాస్‌ (మహారత్న ప్రొడక్షన్స్‌), సురేశ్‌ కొండేటి (ఎస్కే పిక్చర్స్‌) అందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్