గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘జనవరి12 విడుదల’ ప్రమోషన్స్ ప్రారంభం

5 గంటల క్రితం

‘జనవరి12 విడుదల’ ప్రమోషన్స్ ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 08:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌, కీర్తి సురేష్‌, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'జనవరి 12 విడుదల'. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రేపటి నుంచి ప్రమోషన్స్‌ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా కృతిశెట్టి, అనిల్‌ రావిపూడి 'దళపతి' సినిమాలోని ఓ ఫేమస్‌ సన్నివేశాన్ని రీక్రియేట్‌ చేశారు. ఈ వీడియోలో కృతిశెట్టి, కీర్తి సురేష్‌తో రీల్‌ చేస్తానని అడగగా.. అనిల్‌ రావిపూడి ఆమెపై ఫైర్‌ అవుతారు. దీంతో ఆమె నవ్వుతూ వెళ్లిపోతారు. అనంతరం కీర్తి సురేష్‌ ఇది గర్ల్స్‌ సాంగ్‌ అంటూ మ్యూజికల్‌ ప్రమోషన్స్‌పై హింట్‌ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. షైన్‌ స్క్రీన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌ సమర్పిస్తున్నాయి. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్