శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫేక్ వీడియోపై స్పందించిన రితికా సింగ్

19 గంటల క్రితం

ritika singh.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నటి రితికా సింగ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో డీప్‌ఫేక్‌ వీడియోలు ప్రచారమవుతున్నాయి. వీటిపై ఆమె తాజాగా స్పందించారు. తన పేరుతో కొన్ని నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్‌ వీడియోలను వాటి ద్వారా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో నెలకు రూ.400 వసూలు చేస్తూ కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తాను ఎలాంటి పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవలను ప్రారంభించలేదని, ఆ నకిలీ ఖాతాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ ఉన్న తన అధికారిక ఖాతాను మాత్రమే అనుసరించాలని అభిమానులకు సూచించారు. ఇలాంటి అనుమానాస్పద ఖాతాలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్‌ చేయాలని, డబ్బులు చెల్లించి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్