కోలీవుడ్ నటుడు ధనుష్, మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తోన్న చిత్రం 'ఓం`. ఇందులో ప్రముఖ నటి సాయిపల్లవి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం చిత్ర బృందం ఆమె పాత్రకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆమె నిత్యారెడ్డి అనే ఐపిఎస్ అధికారి పాత్రలో కనిపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేలా ఆమె చేపట్టిన 'ఓం` ఆపరేషన్ గురించి ఈ వీడియోలో చూపించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యణ్కర్ సంగీతం అందించారు. వండర్‌బార్ ఫిలింస్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై శ్రద్ధా అగర్వాల్, ధనుష్, మరియు అజ్మత్ జగ్మగ్ నిర్మిస్తున్నారు. నవంబర్ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఐపిఎస్ అధికారిగా సాయిపల్లవి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 26, 2026, 08:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)