వేణు గోపాల్ హీరోగా నటించిన చిత్రం 'సీతన్నపేట గేట్'. నిపుణ్, కిస్లే చౌదరి, సురభి తివారి, రఘురాం రెడ్డి, పార్థు, సుధీక్షజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. వై. రాజ్ కుమార్, ఆర్. శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు వి. సముద్ర, నటుడు విజయ రామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సాధారణ కమర్షియల్ సినిమాల తరహాలో పాటలు, ఎలివేషన్లకు ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పారు. తాను విన్న యథార్థ సంఘటనలకు కల్పన జోడించి ఈ కథను రూపొందించానని, కొత్త తరహా మేకింగ్, లైటింగ్‌తో సినిమా ఉంటుందని తెలిపారు. హీరో వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.
'సీతన్నపేట గేట్' ప్రీరిలీజ్ వేడుక
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 06:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)