99వ ఆస్కార్ పురస్కారాల పరిశీలనకు ఇప్పటికే భారత్ నుంచి 'గోంధల్', 'అంగ్' చిత్రాలు ఎంపిక కాగా, తాజాగా మరో భారతీయ లఘు చిత్రం 'పంకజ' ఈ జాబితాలో చేరింది. బెంగళూరుకు చెందిన అనూయ స్వామి దర్శకత్వం వహించిన ఈ కన్నడ-తెలుగు ద్విభాషా చిత్రం 14 నిమిషాల నిడివితో రూపొందింది. బెంగళూరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథ మురికివాడలో నివసించే పంకజ అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. తన కుమార్తెతో కలిసి అదృశ్యమైన భర్త కోసం వెతికే క్రమంలో ఆమె అధికార వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని కొందరి వేధింపులకు గురవుతుంది. భర్తను వెతికే క్రమంలో పంకజ ఎదుర్కొన్న సమస్యలు, ఆమె ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. కథలో సహజత్వం కోసం దర్శకురాలు నిజమైన ప్రాంతాల్లో స్థానిక కళాకారులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఆస్కార్ బరిలో ‘పంకజ’ లఘు చిత్రం
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 06:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)