బాల్యపు జ్ఞాపకాల నేపథ్యంలో దర్శకుడు శ్రీకర్ నాయన్ తెరకెక్కించిన చిత్రం 'సమ్మర్ హాలిడేస్'. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాలో రోహన్ రాయ్, అరుణ్ దేవ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. వచ్చే నెల 4 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఓటీటీలోకి 'సమ్మర్ హాలిడేస్'
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)