గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతమిళనాట 'జన నాయగన్' జాతర

2 గంటల క్రితం

విజయ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 09:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయకన్ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళనాడులో తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానులు భారీగా తరలిరావడంతో అనేక ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చెన్నై, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, సేలం తదితర నగరాల్లో భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచా, డప్పుల వాయిద్యాలు, డ్రోన్, లేజర్ షోలతో అభిమానులు సంబరాలు నిర్వహించారు. కొన్ని థియేటర్లలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. తొలి రోజు తొలి ప్రదర్శనను ప్రముఖ నటీమణులు త్రిష, కీర్తి సురేష్, మమిత బైజుతో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అభిమానులతో కలిసి వీక్షించారు. విడుదల సందర్భంగా అభిమాన సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, హెల్మెట్ పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

మరోవైపు చిత్రానికి తొలి స్పందన మిశ్రమంగానే వచ్చినప్పటికీ విజయ్ నటన, అనిరుధ్ నేపథ్య సంగీతం, క్లైమాక్స్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, బాబీ డియోల్, మమిత బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. విడుదలకు ముందు ఈ చిత్రం భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం జరిగినప్పటికీ, మూల కథలోని కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని మిగతా కథనాన్ని పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దామని దర్శకుడు స్పష్టం చేశారు. తమిళనాడులో కనిపించిన స్థాయి సందడి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కనిపించలేదు. గణనీయమైన సంఖ్యలో థియేటర్లను కేటాయించినప్పటికీ ప్రేక్షకుల స్పందన ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్