హీరోయిన్ తాప్సీ పన్ను తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఓ సినిమాలో తనను హీరోయిన్‌గా ఎంపిక చేసిన తర్వాత, అకస్మాత్తుగా తొలగించారని తెలిపారు. కారణం ఏమిటో మొదట చిత్రబృందం చెప్పలేదని, తాను పదేపదే అడగడంతో అసలు విషయం తెలిసిందన్నారు. ‘‘ఆ సినిమాలో నటించే హీరో భార్యకు నేను నచ్చకపోవడం వల్లే నన్ను సినిమా నుంచి పక్కకు తప్పించారని తెలిసి షాక్ అయ్యాను. అసలు ఆ హీరో భార్యకు నేనెందుకు నచ్చలేదో నాకు తెలియదు. ఇది చాలా దారుణం’’ అని తాప్సీ అన్నారు. అయితే ఆ హీరో, ఆయన భార్య పేర్లను తాప్సీ వెల్లడించలేదు.
హీరో భార్యకు నచ్చలేని నన్ను తీసేశారు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)