గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘హనుమాన్‌-2’లో వైష్ణవ్‌ తేజ్‌

5 రోజుల క్రితం

‘హనుమాన్‌-2’లో వైష్ణవ్‌ తేజ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 06:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్‌’ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ రూపొందుతోంది. ఇందులో హనుమంతుడి పాత్రలో రిషబ్‌ శెట్టి నటిస్తున్నారు. తాజాగా వైష్ణవ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో ‘హనుమాన్‌ ది రైజ్‌ ఆఫ్‌ వానరాస్‌’ పేరుతో మరో చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘హనుమాన్‌’కు సీక్వెలా లేదా కొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ‘హనుమాన్‌’ నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‘హనుమాన్‌ 2’ ప్రాజెక్టును ప్రకటించిన నేపథ్యంలో ఈ కొత్త ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్