ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న చిత్రం 'ఇడుపు కాయితం'. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'శ్రీలత శ్రీలత.. శ్రీనివాసుడే నీ జత', 'గోగులు', 'గడప' పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా 'ఉల్లిపూల సీరే గట్టి.. ఉత్తరాది సెరువే దాటి' అంటూ సాగే మరో పాటను శనివారం విడుదల చేశారు. అభినయ శ్రీనివాస్ సాహిత్యం అందించిన ఈ పాటను హెనాగ్రేస్ ఆలపించారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబిత సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఉల్లిపూల సీరే గట్టి...
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 07:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)