శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటీటీల్లో ఫ్రైడే సందడి.. ఒక్క రోజే 17 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు

1 గంట క్రితం

ott
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 09:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పుష్కలంగా అందనుంది. శుక్రవారం (జూలై 24) ఒక్కరోజే వివిధ ఓటీటీ వేదికల్లో మొత్తం 17 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. తెలుగు డబ్బింగ్ చిత్రాలతో పాటు హాలీవుడ్, స్పానిష్, తమిళ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషలకు చెందిన పలు చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో ద ట్రూతర్స్, 72 అవర్స్, లాస్ క్రెయంటస్, ముసాఫిర్ కేఫ్, కాన్ సిటీ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్‌స్టార్‌లో స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్, ది డెవిల్ వియర్స్ ప్రదా 2, స్టార్ ట్రెక్: స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ విడుదల కానుండగా, బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ జూలై 25 నుంచి అందుబాటులోకి రానుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆదర్శ్ బాల్ విద్యాలయ, ఈగో రామన్ స్ట్రీమింగ్ కానుండగా, జీ5లో అగ ఆయ్ అహో ఆయ్, ప్రేమ్ షాట్స్ విడుదల కానున్నాయి. సోనీ లివ్‌లో పల్లిచట్టంబి, లయన్స్‌గేట్ ప్లేలో ప్రొటెక్టర్, ఆపిల్ టీవీ ప్లస్‌లో ద డింక్, సన్ నెక్స్ట్‌లో సీక్రెట్ ఆఫ్ కళింగ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

వివిధ భాషలు, విభిన్న జానర్లకు చెందిన ఈ చిత్రాలు, సిరీస్‌లతో ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పండనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్