మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అరవింద్‌ స్వామితో విఘ్నేష్‌ శివన్‌ కొత్త సినిమా

5 గంటల క్రితం

అరవింద్‌ స్వామితో విఘ్నేష్‌ శివన్‌ కొత్త సినిమా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 05:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ మరో రొమాంటిక్‌ కామెడీ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో అరవింద్‌ స్వామి, భరత్‌ కీలక పాత్రలు పోషించనున్నారు. కథ నచ్చడంతో అరవింద్‌ స్వామి వెంటనే నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. నజ్రియా కథానాయికగా నటించనున్నారు. ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’తో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన విఘ్నేష్‌ శివన్‌ ఈసారి రొమాంటిక్‌ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్యాషన్‌ స్టూడియోస్‌, రౌడీ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే నిరాడంబరంగా పూర్తయ్యాయి. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్