తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ మూవీ విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ తొలగించారని నటి ఆనంది ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆమె దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆమె, ‘విజయ్ సినిమాలో నటించే అవకాశం రావడం నాకెంతో ప్రత్యేకం. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాది పాటు సమయం కేటాయించి, ఎంతో శ్రమించి పనిచేశాను. కానీ సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో చూసినప్పుడు నా సన్నివేశాలు లేకపోవడంతో నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ఒక పెద్ద స్టార్ సినిమాలో అవకాశం వచ్చినందుకు నేనెంతో అంకితభావంతో పనిచేశాను. కానీ చివరకు నా పాత్రనే పూర్తిగా తొలగించడం బాధ కలిగించింది’ అని భావోద్వేగంగా మాట్లాడారు. దాన్ని చూసిన కొంతమంది నెటిజన్లు ఆమెకు మద్దతునిచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చిత్రం నిడివి తగ్గించడానికి ఆనంది పాత్రను తొలగించినట్లు కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
Print Editionనా సీన్లన్నీ కట్ చేశారు: నటి ఆవేదన
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 09:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)